ఆస్కార్ పురుషోత్తమ

ఆస్కార్ పురుషోత్తమ

హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో మావా సో చాలా మంది ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నారు కానీ ఎంతో కష్టపడితే తప్ప లక్షల కోట్ల మందికి చేరడం వల్ల మాత్రమే ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది, రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కీరవాణి ఫైట్ మాస్టర్ నిర్మాతలు ఎంతో  డెడికేషన్ తో  ఈ సినిమాపై ఎంతో శ్రమ పెట్టి చేయడం వల్ల ఈ రోజు ఎప్పటి నుండో ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న బాలీవుడ్ ని కాదని మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుని సాధించింది.

ఆస్కార్ పురుషోత్తమ

ఒక సమయంలో సౌత్ సినిమా అంటే బి గ్రేడ్  సి గ్రేడ్ సినిమాలు  మాత్రమే తీస్తారు ఆరు పాటలు నాలుగు ఫైట్లు తప్ప సినిమాలో ఏమీ ఉండదు ఎప్పుడో ఒకసారి ఏవో ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అంతే తప్ప సౌత్ లో ఏమీ లేదు అనుకునే వాళ్ళకి ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లకి చెప్పుతో కొట్టినట్టు సౌత్ సినిమా అంటే తెలుగు సినిమా తెలుగు సినిమా అంటే ఆస్కార్ రేంజ్ అంత అని telugu వాడి వేడి చాటి చెప్పి తెలుగు జాతి పొగరుగా తలెత్తుకునేలా చేసిన జక్కన్న అంటే మన రాజమౌళి  చరితార్థుడు..

ఒకప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలంటే ఒక చిన్న క్యారెక్టర్ కు కూడా అది కూడా ఒక నిమిషం క్యారెక్టర్ కి కూడా మీరు సరిపోరు మీ  రేంజ్ బాలీవుడ్ కాదు ,  అని మన తెలుగు హీరోయిన్లని హీరోలని చిన్న పాత్రలకి నిమిషం కూడా వ్యవధి లేని పాత్రలకి  ఆఫర్లు ఇచ్చిన వాళ్లు బాహుబలి సినిమాతో మన రేంజ్ ఏంటో తెలుసుకొని సరాసరి మన తెలుగు సినిమాలలో మామూలు  పాత్రలు చేసే సహా నటి నటులకు కూడా బాలీవుడ్ సినిమాలలో ముఖ్యమైన పాత్రలు ఇస్తూ తెలుగు నుండి కూడా బాలీవుడ్ సినిమాలు ఆడాలి వాళ్లకు డబ్బులు రావాలి అనే స్థితికి తీసుకెళ్ళిన సినిమాలు బాహుబలి-1 బాహుబలి-2.

ఆస్కార్ పురుషోత్తమ

ఈ రెండు సినిమాలతో ప్రపంచానికి తెలుగు కథను పరిచయం చేసిన విజయేంద్ర ప్రసాద్ గారిని వాల్మీకి అనాలో , ఆదికవి అనాలో , రామాయణాన్ని పార్వతి దేవికి చెప్పిన శివుడు అనాలో లేదా 18 పురాణాలూ చెప్పిన “ సుతగోస్వామి” అనాలో …ఆ పరమ శివుడికే తెలియాలి, నాకైతే ఆయన కలం చేతపట్టి తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి బయలుదేరిన “పురుషోత్తముడు” లా కనిపిస్తున్నాడు. 

అయితే సాహో ద్వారా ఫ్లాప్ అందుకున్న ప్రభాస్ మళ్లీ బాలీవుడ్ విమర్శలకి గురయ్యారు కానీ అదే సాహో సినిమా బాలీవుడ్ లో హిట్ అయింది కానీ తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది ఇక ఆ తర్వాత మళ్లీ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యాం అనే సినిమాతో ప్రభాస్ మళ్లీ తన సత్తా చూపెట్టడానికి రెడీ అయ్యారు అయితే అప్పటికే బాలీవుడ్లో సౌత్ సినిమా అంటే గుండెలు  అదిరెలా భయం పుట్టడంతో అందరూ కలిసి హిట్ అవ్వాల్సిన సినిమాని  ఫ్లాప్ చేశారు.. కానీ  రాదే శ్యాం ఫ్లాప్ అవ్వడం వల్ల  ప్రభాస్ జరిగిన నష్టం సున్నా ఎందుకంటే అప్పటికే ప్రభాస్ వరల్డ్ ఫ్యాన్ ఇండియా స్టార్ లిస్ట్ లో చేరిపోయాడు… 

ఆస్కార్ పురుషోత్తమ

ఇక మళ్ళీ సౌత్ సినిమా పడిపోయినట్టే అని అనుకుంటున్న సమయంలో మీ తాతలు దిగిరావలె అని విర్ర  వీగుతున్న టైం లో ఆ మహా శివుడు చెక్కిన మనిషి రూపంలో ఉన్న జక్కన్న మళ్లీ ఇద్దరూ సౌత్ సూపర్ స్టార్లతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు అదే ఆర్ ఆర్ ఆర్..

ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్తో బాలీవుడ్ స్టార్ హీరోలు గత 40 ఏళ్లుగా బాలీవుడ్ ని వెలుతున్న సూపర్ స్టార్లు బెంబేలెత్తిపోయారు ఈ సినిమాని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డారు కానీ పళ్ళున్న చెట్టుకి ఎంత గాలివీచిన కాయలు రాలుతాయి తప్ప వేర్లు కాదు !

ఆస్కార్ పురుషోత్తమ

అలా మొదలైన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎక్కడ గురి తప్పకుండా  వేర్లు పెకిలించకుండా అద్భుతంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎలాంటి సందేహం లేకుండా అద్భుతమైన ఎక్స్పెక్టేషన్స్ తో ప్రపంచవ్యాప్తంగా రెండు మూడు చోట్ల తప్ప విడుదల ఎవ్వరి గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఆర్ ఆర్ ఆర్   రిలీజ్ కు ముందే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన నాటు నాటు సాంగ్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది ఆ దెబ్బతో ఏ భాషలో రిలీజ్ చేసిన ఏ దేశంలో  రిలీజ్ చేసిన సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది కథ, కథనం, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్, కీరవాణి మ్యూజిక్ డాన్స్,  ఫైట్స్ అన్ని అత్యంత అద్భుతంగా కుదిరి జక్కన్న చెక్కిన శిల్పం పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టింది.  ఇక ఈ దెబ్బకి బాలీవుడ్ జహాపనా తుస్సి  గ్రేట్ హో అని  మళ్లీ తెలుగు సినిమా  కాళ్ళ బేరానికి వచ్చింది..

ఆస్కార్ పురుషోత్తమ

ఏ తెలుగు సినిమాను అయితే హేళన చేశారో ఏ తెలుగు సినిమా ఆర్టిస్టులయితే తమ సినిమాల్లోకి తీసుకోలేదొ,  అదే బాలీవుడ్ సూపర్ స్టార్ నెపోటిజం వలన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నెపోటిజం కిడ్స్ తమ సినిమాలను మన తెలుగు స్టార్ల ద్వారా తెలుగులోకి డబ్బింగ్ చేసి ప్రమోషన్ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు… అలా ప్రమోట్ చేసి అంతో ఇంతో తెలుగులో హిట్ అయ్యేలా చేసుకున్న సినిమాల లిస్టులో ఉన్నదే బ్రహ్మాస్త్రం.

ఇక అందరూ కలిసిపోయి ఎలా అయినా ఒక సూపర్ హిట్ సినిమా తీయాలనుకొని బాలీవుడ్ లో ఇద్దరు ఖాన్లు కలిసి చేసిన సినిమా పటాన్, విడుదలై 1000 కోట్లు కలెక్ట్ చేసింది అని ఊదరగొడుతున్న సమయంలో  1000 కోట్లు దాటడం నాకు వారం రోజుల పని అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్న టైం లో , రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ ఏకంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ కి నామినేట్ అయ్యి ఆస్కార్ కి నామినేట్ అయ్యే లోపే ఎన్నో అవార్డులని గెలుచుకుంది..

ఇక  ఇక ఈ విషయం తెలిసి ఒక త్రయం అంతా ఒక్కసారిగా కుంగిపోయింది నామినేట్ అయినా పర్వాలేదు కానీ ఎలాగైనా అవార్డు మాత్రం రావద్దు అని ఎంతో ప్రయత్నం చేసేది.  కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జనం మెచ్చిన , కాదు ప్రపంచ జనం మెచ్చిన “నాటు నాటు నాటు  నాటు“ పాటకు ప్రపంచ సినీ చరిత్రలోనే అతి గొప్పదైన సినిమా అవార్డు “ ఆస్కార్” అవార్డు లభించింది, ఇక ఆస్కార్ స్టేజి పైన ఈ అవార్డు ను సంగీత దర్శకుడు ఏం.ఏం .కీరవాణి, ఈ పాట రాసిన లిరిసిస్ట్ చంద్రబోస్ అందుకుని మన తెలుగు జాతి గర్వించేలా మాట్లాడటం , భారతదేశం తరపున ఈ అవార్డు అందుకున్నాము అని చెప్పడం ఏ గర్వము లేని నిజంగా మన తెలుగు వాళ్ళకే సాధ్యం ..

ఆస్కార్ పురుషోత్తమ

ఇక ఎప్పటికీ అందని ద్రాక్ష ఆస్కార్ అని అనుకున్న మన ఇండియన్స్ కి , మదర్ ఇండియా , లగాన్ సినిమాలకు దక్కని అవకాశం రాజమౌళి “ ఆర్ ఆర్ ఆర్ “ కి దక్కింది.

ఏదేమైనా ఇది మరలా జరుగుతుందో లేదో తెలియదు కానీ ఇదే నా భూతో నా భవిష్యత్ ..

దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ క్రింద చూపించాను , కానీ ఏదో మాఫియా మన ఆర్ ఆర్ ఆర్ ని మాత్రం IMDB టాప్ 100 లిస్టులో లేకుండా చేసింది.

జై హింద్ అని చెప్పడం తప్ప ఇంకేమి ఇవ్వలేని గొప్ప అభిమాని…

– మీ అర్జున్ విదీర్ ఖండే 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.