తమన్నాకి పెళ్లి యోగం ఇక లేనట్టేనా?
తమన్నాకి పెళ్లి యోగం ఇక లేనట్టేనా?
తమన్నా కి పెళ్లి యోగం ఉందా లేదా ఇంతకీ అసలు పెళ్లి పైన తమన్నా అభిప్రాయం ఏంటి?
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు తమ ప్రేమ వ్యవహారాలను మరియు త్వరలో పెళ్లి చేసుకోబోయే తమ జీవిత భాగస్వాముల ఫోటోలు వైరల్ చేస్తూ ఫ్యాన్స్ కి కన్నులపండగ చేస్తున్నారు. మొన్న కాజల్, నిన్న హన్సిక ఇలా ఒకరి తర్వాత మరొకరు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళే అంటూ ఒకరకంగా సినిమా లైఫ్ ని పక్కన పెట్టి చక్కగా సెటిల్ అయిపోయారు. మరి తమన్నా పరిస్థితి ఏమిటి ఫ్యాన్స్ కు తన పెళ్లి వార్త ఎపుడు చెప్తుందా అంటు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు
మరి తమన్నాకి అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. తమన్నా పెళ్లి పుకార్లు వైరల్ అవడానికి కారణం ఏంటంటే, కొందరు ఆమె రిలేషన్ లో ఉంది అంటూ ముంబైకి చెందిన ఒక పెద్ద బిజినెస్ మేన్ ని తర్వలో పెళ్లి చేసుకుంటుంది అంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే మరొకవైపు తను ఒక బిజినెస్ మేన్ ని తర్వలో పెళ్లి చేసుకోబోతుదని అందుకే సినిమా కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేయడం లేదు అని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ విషయం పై ఆమె స్పందిస్తూ నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అంటూ నేను సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నానని ఇప్పట్లో పెళ్లి నిర్ణయం లేదూ అని ఆమె మీడియా వార్తలపై స్పందించారు.
తమన్నా పై ఇటువంటి వార్తలు రావడం కొత్త విషయమేమీ కాదు అంటూ, అ మధ్య కాలంలో కూడా తను ఒక క్రికెటర్ తో ప్రేమ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ తమన్నా మాత్రం ఈ విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదు అంతే కాకుండా తన పై వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు. ఆ వార్తలు కేవలం రాతలకే కానీ జీవితానికి ఉపయోగపడేవి కాదు అని తేల్చి చెప్పేశారు. తనకు ఇపట్లో అ ఉద్దేశం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
అయితే తన సినిమా ప్రాజెక్ట్ ల తో బిజీగా ఉంటున్న తమన్నాకి పెళ్లి ఉద్దేశం లేదు అని ఫ్యాన్స్ కి అర్దం అయిపోయింది. తన మీద వచ్చిన వార్తలు గాలిలో కాగితాలు అని నిరాశ చెందారు మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్.
చిన్న వయస్సు నుండే ఇండస్ట్రీ లో తన కెరీర్ నీ స్టార్ట్ చేసిన తమన్నా గారు ఎన్నో మంచి సినిమాలో నటించారు. అవంతిక అనే పాత్రలో బాహుబలి సినిమా లో కనిపించి అందరినీ అలరించారు. అయితే ఈ సినిమాకే కాకుండా తన నటన కీ కూడా మంచి గుర్తింపు వచ్చింది. తన తోటి సెలబ్రిటీలు అంత హ్యాపీ గా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారంటూ, తమన్నా గారు తన పెళ్లి వార్త ఎప్పుడు అనౌన్స్ చేస్తుంది అంటూ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు తమన్నా అభిమానులు
పెళ్లి అనేది జీవితంలో అవసరమైనదే కాని అది కేవలం జీవితంలో ఒక భాగమే అంటూ దానితో అన్ని మూడి పడి ఉంటాయి అనుకోవడం పొరపాటు అంటుంది మిల్కీ బ్యూటీ తన దృష్టి అంతా ప్రస్తుతానికి సినిమాల పైనే ఉందని ఆమె తన ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. కానీ బీ టౌన్ లో నిత్యం తన పై వార్తలు మాత్రం చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి అంటూ నెటిజన్లు చెప్తున్నారు.
తన తోటి నటి అయిన హన్సిక రీసెంట్ గా తన వివాహ వార్తా ప్రకటించింది అని తెలిసిందే. కానీ తమన్నా మాత్రం ఒంటరిగా ఉండటానికీ ఇంకా ఇష్టపడుతుంది అని తన సింగిల్ స్టేటస్ ను మార్చుకోను అని కూర్చుంది. తన రిలేషన్ షిప్ స్టేటస్ ను కాని పెళ్లి ప్రస్తావన కాని ఎక్కడ చర్చించుకోవొద్దు అని మీడియా కు తెలిపారు.
అసలు తను ప్రేమలో ఉందో లేదో కూడా ఇప్పటికి అయితే సస్పెన్స్ అనే చెప్పాలి.
కేవలం తెలుగు భాషలో నే కాకుండా హిందీ, తమిళ్, చిత్రాల్లో కూడా తన నటనను కనబరిచారు. కొన్ని ఐటెం సాంగ్స్ లో కూడా తమన్నా గారు నటించారు. ఇక తన డాన్స్ స్టెప్ ల తో యూత్ నీ బాగా ఆకటుకుంది 2000’s లో బ్రేక్ ఇచ్చిన టాప్ హీరోయిన్ లలో తమన్నా ఒకరు తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఉండడం తో తనకి ఇంకా వేరే ధ్యాస లేదు అన్నట్లు తెలుస్తోంది.
నెటిజన్లు తమ్మానా కూడా అనుష్క, టబుల జాబితాలో చేరుతుందా అని పుట్టించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తమన్నా కూడా 35 లిస్ట్ లో చేరింది అని అయినా కుడా పెళ్లి ఆలోచన లేదు ఏంటి అంటు జనాలా ట్రోలింగ్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మారింది తమన్నా.
ఇండస్ట్రీ లో దాదాపు పెద్ద హీరో నుండి సామాన్య హీరో వరకు అందరితో నటించారు ఈమె ఇంత క్రేజ్ ఉన్న తమన్నా పర్సనల్ లైఫ్ నీ సైతం పక్కన పెట్టి కేవలం ప్రొఫెషనల్ లైఫ్ నీ మాత్రమే చూసుకుంటున్నట్టు తెలుస్తోంది పెళ్లి లాంటి ఆలోచనలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని దీనిని బట్టి అర్థమవుతుంది.
తనకి కావాల్సిన లైఫ్ పార్టనర్ విషయం లో తను చాలా జాగ్రతగా ఉందని అలాగే తొందరపడకుండా తనకి కావాల్సిన వాడిని తనే సెలక్ట్ చేసూకుంటానని
ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అని చెప్తుంది. అయితే తమన్నా కోరుకునే ఆ డ్రీమ్ బాయ్ ఎవరా అని ఎప్పుడు గుడ్ న్యూస్ నీ రీవెల్ చేస్తుంది అంటూ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.