ఫోన్లు నిజంగానే మారిపోయాయా ? మార్చేసారా !

 

ఫోన్లు నిజంగానే మారిపోయాయా ? మార్చేసారా !

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కీలక పరిణామం జరిగింది. మూడోసారి ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తన మొబైల్ ఫోన్లను మీడియాకు చూపించారు. డీల్స్ మాట్లాడుకున్న ఆధారాలను కవిత ధ్వంసం చేశారని.. తన 9 ఫోన్లను మాయం చేశారంటూ ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపిన విషయం తెలిసిందే.

అయితే తన ఫోన్లు భద్రంగానే ఉన్నాయంటూ ఫోన్లను ప్రదర్శించారు కవిత. తన ఫోన్లను అప్పగిస్తున్నానంటూ ఈడీ డైరెక్టర్‌కు ఆమె లేఖ రాశారు. ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని తన లేఖలో ఆమె ఆరోపించారు.

అయితే కవిత ఫోన్లను మీడియాకు విడుదల చేసినా.. ఇప్పుడు మరో చర్చ తెరపైకి వస్తోంది. రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించిన ఫోన్ నెంబర్లు, ఐఎంఈఐ నెంబర్లు.. ఇవాళ కవిత చూపించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు ఒకటేనా కాదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఈడీ చెబుతున్న నెంబర్లకు.. ఇవాళ కవిత చూపించిన ఐఎంఈఐ నెంబర్లలో కొన్ని మ్యాచ్ కావడం లేదు. దీంతో ఫోన్లు ధ్వంసం చేశారంటూ ఈడీ చెబుతున్నది నిజమా..? లేక కవిత చెబుతున్నది నిజమా..? అనే చర్చ సాగుతోంది.

ఫోన్లు నిజంగానే మారిపోయాయా ? మార్చేసారా !

 

ఇక్కడే మరో విషయంలో మాత్రం క్లారిటీ వచ్చింది. ఈడీ చెబుతున్నట్లే ఎమ్మెల్సీ కవిత.. 9 ఫోన్లను మార్చారన్నది నిజమని తేలింది. స్వల్ప వ్యవధిలోనే కవిత ఇన్ని ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న సందేహం వస్తోంది. సాధారణంగా రహాస్య వ్యవహారాలు చేసేవాళ్లే ఇలా మారుస్తారనే విమర్శలు కూడా వస్తున్నాయి.

ఈడీ అధికారి జోగేంద్రకు రాసిన లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత.. తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తనపై ఫోన్లను ధ్వంసం చేశారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంపై ఆమె ఫైర్ అయ్యారు. ఈడీ తనపై దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నా..

గతంలో తాను వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఒక మహిళ ఫోన్ స్వాధీనం చేసుకోవడం ప్రైవసీకి భంగం కల్గించదా..? అని ప్రశ్నించారు.

 

మరోవైపు ఈడీ విచారణ మంగళవారం కూడా కొనసాగుతోంది. దాదాపు ఆరు గంటలకుపైగా కవితను ఈడీ ప్రశ్నిస్తోంది.

అదేవిధంగా కవిత సమర్పించిన ఫోన్లు అక్టోబర్ తరువాత వాడినవిగా గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతకంటే ముందు జరిగిందని.. అప్పుడు వాడిన ఫోన్లు ఇవ్వాలని కవితను ఈడీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ స్కామ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.