తండ్రి కొడుకులు కలిసి చరిత్ర తిరగరాయబోతున్నారా?
అవును నిజమే అని అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు , నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు , విశ్వ విఖ్యాత నట సార్వాబౌమ నందమూరి తారకరామారావు, సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుండి మొదలైన వారసత్వ సినీ మలుపులు తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప సినిమాలను తెలుగు సినీ అభిమానులకు అందించాయి.
బాలీవుడ్ లో మొదలైన తండ్రి కొడుకుల కాంబినేషన్ , తెలుగు సినిమా పై కూడా పడి చాల గొప్ప చిత్రాలు తీసారు , నందమూరి తారకరామారావు తన కొడుకు బాలకృష్ణ తో అక్బర్ సలీం అనార్కలి , తాతమ్మ కల, అన్నదమ్ముల అనుబంధం,వేములవాడ భీమకవి,దాన వీర శూర కర్ణ,శ్రీమద్ విరాట పర్వం,రౌడీ రాముడు కొంటె కృష్ణుడు,బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తో ఏకంగా ఎనిమది సినిమాలు చేసాడు .
ఇక ఆ తర్వాత నాగేశ్వర రావు గారు నాగార్జున తో కలిసి కొన్ని సినిమాలు చేసాడు , ఇక సూపర్ స్టార్ కృష్ణ అయితే ఒక అడుగు ముందుకేసి కొడుకు మహేష్ బాబు ని చిన్నప్పటి నుండే తన సినిమాలలో ముఖ్యమైన పాత్రలకు పెట్టుకుని చిన్నప్పుడే మినీ సూపర్ స్టార్ బిరుదు ను కూడా వచ్చేలా చేసాడు.
అల ఎంతో మంది వేరే హీరోలు కూడా తమ పుత్ర రత్నాలతో నటించినా పైన పేర్కొన్న కొంతమంది మాత్రమే విజయం సాధించారు.
అయితే ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న ఒక రూమర్ లేదా బజ్ ఏంటి అంటే తన సొంతకాళ్ళ మీద హీరోలా ఎదిగి, మెగాస్టార్ గా ఎదిగి , తన కంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో తన లైఫ్ ను మార్చేసిన సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా “ ఖైది” ని తీయబోతున్నట్టు సమాచారం..
సినిమా రీమేక్ చేస్తున్నారు కదా దాంట్లో ఏముంది అనుకోవడం సహజం ,కానీ ఇక్కడే మెగా అభిమానులను షాక్ , సర్ ప్రైజ్ కి గురి చేసే విషయం ఒకటుంది ? అదేంటంటే ఈ సినిమా ను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన దర్శకత్వం లోనే తీయబోతున్నట్టు భోగట్టా..
ఎందుకంటె చిరు గారి కెరీర్ లో ఖైది అనే సినిమా ఒక మేలిమి వజ్రం, ఆ సినిమా కథను ఆకళింపు చేసుకుని మెగాస్టార్ నటించిన తీరూ అద్భుతం, అలంటి కథను మళ్ళి తీయాలి అంటే ఇప్పటి దర్శకులకు ఆ కథ ఆత్మ (soul) అర్ధం అవ్వకపోవచ్చు లేదా ఆ కథ ముగింపు నచ్చకపోవచ్చు ..
కానీ మెగాస్టార్ గనుక నిజంగా రాంచరణ్ తో ఈ సినిమా మళ్ళి తీస్తే మాత్రం బాహుబలి , బాహుబలి 2 , ఆర్ ఆర్ ఆర్ లను కూడా తలదన్నేలా తీయగలరు అనేది నిజం..
కానీ ఇదంతా జరగాలి అంటే ఆ పవనసుతుడి ఆజ్ఞ తప్పనిసరి , సరే వేచి చూద్దాం.. జై చిరంజీవ.
(గమనిక: ఇదంతా కేవలం కల్పితం మాత్రమే , ఇలా జరిగితే బాగుండు అని అనుకునే ఒక
తెలుగు సినిమా అభిమాని రాసిన కల్పిత ఆర్టికల్ ఇది – ఈ వెబ్ సైట్ అన్ని న్యూస్ గురించి రాస్తూ ప్రజా వినోదం కోసం ఇలాంటి ఊహించని కాంబినేషన్ గురించి జరగని విషయాల గురించి ఎంటర్ టైన్ మెంట్ ధ్యాసలో రాస్తుందే తప్ప ఎవ్వరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం మా వెబ్ సైట్ కు లేదు) గమనించగలరు