DMCA.com Protection Status

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

సినిమా : హనుమాన్
రేటింగ్ : 3/5
నటీ నటులు: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్, సముద్ర ఖని, సత్య,వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : అనుదీప్ దేవ్
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : ఎస్. నిరంజన్ రెడ్డి, కే. నిరంజన్ రెడ్డి. 

కథ : అంజనాద్రి (ఫిక్షనల్) ఊరిలో హనుమంతు తన అక్కయ్య అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) తో కలిసి ఉంటాడు చిన్నప్పుడే తల్లి తండ్రులు చనిపోవడం తో అక్కనే హనుమంతును పెంచుతుంది.

అయితే తన ఊరి స్కూల్ లో చదువుకునే మీనాక్షి ని హనుమంతు ప్రేమిస్తుంటాడు ఆమెకు అన్ని విధాలా సాయం చేస్తుంటాడు కానీ అది హనుమంతు అన్న విషయం ఆమెకు తెలియదు.

ఇక ఆ ఊరిని పాలేగాడు తన కంట్రోల్ లో పెట్టుకుని ఊరి జనాన్ని దోచుకుంటూ ఉంటాడు అతనికి ఎదురు తిరిగిన వారిని కుస్తీ పోటీలు పెట్టి చంపేస్తుంటాడు.

అతన్ని ప్రశ్నించిన మీనాక్షినీ తన మనుషులతో చంపించ బోతుంటే కాపాడాలని ట్రై చేసిన హనుమంతు అనుకోకుండా సముద్రంలో పడి పోతాడు అక్కడే అతనికి హనుమంతు ని పవర్స్ ఉన్న మణి దొరుకుతుంది దాంతో తనకు సూపర్ పవర్స్ వస్తాయి.

దాంతో ఊరి పాలే గాడి మీద ఎదురు తిరిగి అతన్ని ఓడిస్తాడు.

మరొక వైపు సూపర్ హీరో అవ్వాలి అని చిన్నప్పటి నుంచీ కలలు కన్న మైఖేల్ కు ఒక వీడియోలో హనుమంతు కు సూపర్ పవర్స్ ఉన్నాయని తెలిసి అంజనాద్రి కి వస్తాడు.

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

హనుమంతు దగ్గరున్న మణి వల్లే పవర్స్ వచ్చాయని తెలుసుకుని అది దక్కించుకునే ప్రాసెస్ లో హనుమంతు అక్కని చంపేస్తాడు ఆ ఊరిని తన అధీనంలోకి తెచ్చుకుంటాడు అక్కను పోగొట్టుకున్న హనుమంతు ఊరి జనాన్ని ఎలా కాపాడాడు…

అసలు హనుమంతుకు సాయం చేసింది ఎవరు?? అన్నది సినిమా చూసి తెలుసు కోవాల్సిందే.

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

విశ్లేషణ : ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు కానీ ఎప్పుడైతే ప్రభాస్ ఆది పురుష్ సినిమా ఫెయిల్ అయ్యి ఆ సినిమా గ్రాఫిక్స్ ట్రోల్స్ కు గురి అయ్యాయో అప్పుడు హనుమాన్ సినిమా టీజర్ రిలీజ్ అవడంతో ఒక్కసారిగా ఆ క్వాలిటీకి షాక్ అయ్యారు .

See also  HMDA అవినీతి తిమింగలం శివరామ కృష్ణ కేసు లో పురోగతి

ఇక అప్పటి నుంచి ఈ సినిమా మీద బజ్ మొదలైంది.ఆ బజ్ ట్రయిలర్ రిలీజ్ వరకూ నడిచింది అదే సమయంలో అటు అయోధ్య లో రామ మందిరం నిర్మాణం కూడా ఈ సినిమాకు ప్లస్ అయింది దాంతో ఈ సినిమా పాన్ ఇండియా టర్న్ తీసుకుంది.

అయితే సినిమా నిజంగా అంతగా అలరించిందా అంటే దాదాపు గా పాస్ మార్కులు పడతాయి.ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్ స్లో గా మొదలైనా ఒకసారి హీరోకి సూపర్ పవర్స్ వచ్చిన దగ్గరి నుంచీ సినిమా ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంది.

దాంతో ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ శాటిస్ ఫై అవుతారు ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ ముందు హీరో చేసే ఫైట్ అది హనుమంతుడు లంకలో తన తోక చుట్టుకుని పైన కూర్చున్న విధంగా డిజైన్ చేయడం  ఆ గ్రాఫిక్స్ చాలా బాగా వర్కవుట్ అయ్యాయి.

ఫస్ట్ హాఫ్ లో పాటలు, కామెడీ కూడా బాగానే వర్కవుట్ అయింది మరొక వైపు గ్రాఫిక్స్ కూడా మంచి క్వాలిటీ తో ఉండడంతో పెద్దగా కంప్లైంట్స్ ఏం ఉండవు.

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

అయితే సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా మెల్లగా గ్రాఫ్ పడటం స్టార్ట్ అయ్యింది ముఖ్యంగా హనుమంతు అక్కయ్య చనిపోయాక సినిమా ఎమోషనల్ ట్రాక్ లో ఏమైనా వెళ్తుందా అన్న అనుమానం కలుగుతుంది .

కానీ మళ్ళీ హీరోను యాక్షన్ లోకి తీసుకు వచ్చి డైరెక్టర్ సినిమాకు ఊపు తీసుకు వచ్చాడు.

అయితే సముద్ర ఖని పాత్రను ముందు నుంచి సస్పెన్స్ గా పెట్టీ ఆ తర్వాత అతనే విభీషణుడు అని రివీల్ చేయడం ఒకే కానీ ఆ పాత్రకు కొంచెం పెద్ద స్థాయి నటుడు ఉండుంటే సినిమా రేంజ్ పెరిగేది.

ఇక చివరలో సాక్షాత్తు హనుమంతుడే దిగి వచ్చాడు అన్న దగ్గర ఆడియన్స్ కు ఒక విధమైన హై రావడం పక్కా ఆ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే రామ అలాగే హనుమ భక్తులకు ఖచ్చితంగా పూనకాలు తెప్పిస్తుంది.

అయితే సెకండాఫ్ కు కథ సింగిల్ థ్రెడ్ లో నడవడం అన్నది కథలో పెద్దగా విషయం లేదన్న సంగతి తెలిసేలా చేస్తుంది.

కానీ దర్శకుడు సెకండాఫ్ లో పెట్టుకున్న కొన్ని ఏలివేశన్స్ అలాగే కార్తికేయ 2 లో కృష్ణుడు గురించి చెప్పినట్టు ఇక్కడ హనుమంతుని గురించి చెప్పడం ఆ సమయంలో వచ్చే గ్రాఫిక్స్ హనుమ కూడా ఆడియన్స్ కు నచ్చడంతో పెద్దగా డల్ అనిపించదు.

See also  What happened in Ayodhya regarding Sri Rama Chandramurthy?

చివరగా సినిమా బాగుందా ఆడియన్స్ అంచనాలు అందుకుందా అంటే ఒక చిన్న హీరో దాదాపు ఒక మిడ్ రేంజ్ హీరో తీసుకునే పారితోషకం తోటి ఎంత క్వాలిటీ సినిమా తీయడం నిజంగా అభనందనీయం అనే చెప్పాలి మొత్తానికి మేకర్స్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయం.

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

నటీ నటులు: హనుమంతు గా తేజ సజ్జ అల్లరి అలాగే అమాయక విలేజ్ కుర్రాడి పాత్రలో బాగానే నటించాడు.కామెడీ అలాగే ఎమోషనల్ సీన్స్ లో తన పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది ఇంకా పోను పోను షైన్ అవుతాడు.

యాక్షన్ సీన్స్ లో అయితే బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్టే నటించాడు.

సినిమాలో తన పాత్ర మీదే కాకుండా దర్శకుడు అక్క పాత్రతో కూడా ఫైట్ చేయించి బ్యాలెన్స్ చేశాడు యంగ్ హీరోగా తేజ సజ్జ కు ఇది మంచి పునాది లాంటి సినిమా నార్త్ ఇండియా లో ఈ సినిమా రిజల్ట్ ను బట్టి భవిష్యత్తులో అతని పాన్ ఇండియా స్టార్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

ఇక అక్క పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ఎక్స్ పీరియన్స్ చూపించింది పాత్రకు తగ్గట్టు బాగా నటించింది ఆమె మీద పెట్టిన ఒక ఫైట్ లో కూడా బాగానే చేసింది.ఒక విలన్ గా వినయ్ ఒకే అనిపించాడు.

కమెడియన్స్ సత్య అలాగే గెటప్ శ్రీను,వెన్నెల కిషోర్ ల కామెడీ ఒకే అనేలా ఉంది. విభీషణుడు పాత్రలో సముద్ర ఖని సరిపోలేదు ఆ పాత్రకు ఇంకొంచెం పెద్ద నటుణ్ణి తీసుకుంటే బాగుండేది. గ్రాఫిక్స్ హనుమంతుడు మాత్రం పిల్లలకు బాగా నచ్చుతాడు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్స్: ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే టీజర్ నుంచే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది కాబట్టి అయితే సినిమా క్వాలిటీ బాగుంది అండ్ గ్రాఫిక్స్ సినిమా బడ్జెట్ కు చాలా అద్భుతంగా ఇచ్చారనే చెప్పవచ్చు.

ముఖ్యంగా అంజనాద్రి విలేజ్ అక్కడ హనుమంతుడి విగ్రహం సూపర్ పవర్స్ వచ్చాకా వచ్చే సీన్స్, క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ హనుమంతుడు ఇలా సినిమా ఎక్కువ మార్కులు అక్కడే కొట్టేస్తుంది.

కెమెరా మెన్ వర్క్ సినిమా అంతగా బాగుంది ఎక్కడ కూడా పెద్ద కంప్లైంట్స్ లేవు. ఇక ఆర్ట్ డైరెక్షన్ పర్ఫెక్ట్ గా కుదిరింది.

అలాగే మ్యూజిక్ లో పాటలు అంతగా ఆకట్టుకొనప్పటికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు సినిమా మూడ్ ను నిలబెట్టింది ఎలివేషన్ సీన్స్ లో మంచి జోష్ తెచ్చింది.డైలాగ్స్ లో పెద్ద మెరుపులు ఏం కనిపించలేదు సీన్స్ కు తగ్గట్టుగా ఉన్నాయి.

See also  Shanmukh Jaswant of Bigg Boss fame was arrested for possession of ganja and Released
హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

కథ సెకండాఫ్ లో తేలిపోయింది అక్కడ కొంచెం కసరత్తు చేసుంటే సినిమా లెవల్ నెక్స్ట్ లెవల్ లో ఉండేది సినిమా ఫస్ట్ హాఫ్ లో మొదటి అరగంట, సెకండాఫ్ లో మొదటి అరగంట సినిమా గ్రాఫ్ ను బాగా తగ్గించాయి.

చివరగా దర్శకుడి చెప్పుకోవాలంటే తన తొలి సినిమా నుంచి ఒక డిఫరెంట్ పంథా ఎంచుకున్న ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్ తో ఇలాంటి క్వాలిటీ సినిమా తీయడం గొప్ప విషయమే తనకు ఇంకా పెద్ద బడ్జెట్ దొరికేతే ఎంత అద్భుతాలు తీసాడో చూడాలి.

అయితే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ 2025 లో అని సినిమా చివరిలో చెప్పారు కాబట్టి దానికి దర్శకుడు ప్రశాంత్ కు ఇంకొంచెం పెద్ద బడ్జెట్ దొరుకుతుందని అప్పుడు నెక్స్ట్ లెవల్ సినిమా తీస్తాడని ఆశిద్దాం.

ప్లస్ పాయింట్స్:
హనుమ ఫ్యాక్టర్
ఫస్ట్ హాఫ్ లో సూపర్ పవర్స్ సీన్స్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్
ఇంటర్వల్ బ్యాంగ్ సీన్
సెకండాఫ్ లో రాముడి వెనక హనుమ క్రియేషన్ సీన్
క్లైమాక్స్ లో గ్రాఫిక్స్ హనుమంతుడు

హనుమాన్ మూవీ రివ్యూ తెలుగు

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ మొదటి అరగంట సాగదీత
సూపర్ పవర్స్ సీన్స్ మరీ అద్భుతంగా లేకపోవడం
సెకండాఫ్ లో సినిమా డల్ అవటం
కీలక పాత్రలకు సరైన నటులు పడకపోవడం(విభీషణుడు & విలన్ )

ఫైనల్ థాట్: హనుమంతుడి ఆగమనం!!!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top