DMCA.com Protection Status

ఇలా వచ్చిన లింక్స్ పై క్లిక్ చేశారో మీ అకౌంట్ ఖతం….

ఇలా వచ్చిన లింక్స్ పై క్లిక్ చేశారో మీ అకౌంట్ ఖతం….

సైబర్ నేరగాళ్లు దాదాపు మీకు పంపే మెసేజ్ నిజమని నమ్మేలా చేస్తారు. ఒక్కసారి గనక మనం అది నిజమే అని నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేశాం అంటే అంతే సంగతులు… మన అకౌంట్ లో ఎంత డబ్బు ఉందో అదంతా వాళ్ళ చేతికి చిక్కుతుంది.



ఇది ఇప్పటిమాట కాదు ఇదివరకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి. సామాన్య ప్రజలే కాదు. అన్ని తెలిసి, టెక్నికల్ గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మోసపోయిన సందర్బాలు ఎన్నో…

మొన్నీమధ్య కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన ఒక గవర్నమెంట్ శాఖలో ఒకరు ఇలాగే స్పామ్ లింక్ పై క్లిక్ చేసి దాదాపు 97,000 రూపాయలు పోగొట్టుకున్నారు అని సమాచారం..

ఈ క్రింద చూపబడిన స్క్రీన్ షాట్ ను పూర్తిగా గమనించి, ఆ మెసేజ్ ఎంత భయంకరమైనదో తెలుసుకోండి …


మీకు ఇలాంటి మెసేజెస్ వచ్చినపుడు మీకు తెలియకపోతే వెంటనే మీ ఇంట్లో ఉన్న కొడుకు కూతురు కి చెప్పండి లేదా వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి అంతే తప్ప ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టుకొకండి..

ఒకవేళ అది మీరు అక్రమంగా సంపాదించిన డబ్బు అయితే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడమే మంచిది ..

See also  Prabhas and Gopichand's Unforgettable Friendship in the Making of Bhima

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *